21, డిసెంబర్ 2015, సోమవారం

కాకతీయులు కమ్మవారే

కాకతీయులు-దుర్జయ వంశస్థులు కాకతీయులు పరాక్రమముతో, వీరశూరత్వం కనబరచి శత్రువులకు సింహ స్వప్నమై , పరిపాలించినవారు, రాజ్యాన్ని సుభిక్షం చేసిన ఘనులు ,ప్రజాశ్రేయోభిలాషులు, దానధర్మవారులు.ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయులు కమ్మవారు.కమ్మవారేనా అని సందేహం వక్రబుద్ధి కలిగినవారికి కలుగుతుందేమో కాని , కాదు అనేందుకు మాత్రం ఆధారాలు శూన్యం. కాకతీయ వంశానికి మూలపురుషుడు వెన్నయ.జైన,బౌద్ధ మతాలు ఆచరించటం వలన ఎలాంటి వంశం పేరును వారు ప్రస్తావించలేదు, కాని ఆయన తదనంతరం 12వ శతాబ్దం అంతమున పరిపాలించిన కాకతీయ భూపతి మహాదేవరాజు కమ్మప్రభువని , వీరి వంశం దుర్జయ అని,వర్ణము శూద్రమని చేబ్రోలు ,మోటుపల్లి ,పాకాల శాసనాలలో వ్రాయబడినది.మహాదేవుని కూతురు మైలమదేవి,కొడుకుగణపతిదేవుడు. మైలమదేవి కమ్మవనితని,ఆమెను నతవాటి దుర్జయ వంశానికి చెందిన రుద్రుడు వివాహమాడాడని ఒక శాసనములో పేర్కొనబడినది.వారి కుమారుడే మాధవవర్మ , కూతురు బయ్యలదేవి.మాధవవర్మ కమ్మ ప్రభువని ఒక కన్నడ గ్రంథం నుండి ఇటీవల బయటపడినది.